ఎంఎస్ నారాయణ స్వల్ప అస్వస్థత

January 20, 2015 | 02:37 PM | 30 Views
ప్రింట్ కామెంట్

ఆయన తెరమీద కనిపిస్తే చాలు అందరి మోముల్లో నవ్వులు పూస్తాయి. తాను సీరియస్ గా ఉంటూ ఎదుటి వారికి నవ్వుతెప్పించే కమెడియన్ ఎమ్మెస్‌ నారాయణ. ఈయన ఇప్పుడు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన మలేరియా జ్వరంతో ఆస్ప త్రిలో ఉన్నారు. సోమవారం ఆయన్ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స చేయించి, అదే రోజు రాత్రి హైదరాబాద్‌ కిమ్స్‌ కి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఎమ్మెస్‌కి చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఎమ్మెస్‌ నారాయణకు కూతురు శశికిరణ్ ఇటీవలే ఒక సినిమాకు (సాహెబాసుబ్రహ్మణ్యం) దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు గతంలో హీరోగా నటించిన సంగతి అందిరికీ తెలిసిన విషయమే. ఎమ్మెస్‌ నటించిన దూకుడు, అత్తారింటికి దారేది, బాద్‌షా వంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే అతడు నటించిన పటాస్‌, రేయ్‌ తదితర చిత్రాలు రిలీజ్‌లకు సిద్ధంగా ఉన్నాయి. సడెన్ గా ఆయనకు మలేరియా సోకి బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కొన్ని షూటింగులను ఆయన అస్వస్థత కారణంగా మార్చుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ