ఏదో సంపాదించేసుకుందామని ఈ వయసులో ఇండియాకు వచ్చి పాపం చిక్కుల్లో పడింది మాధురి. మ్యాగీ యాడ్‌లో నటించిన ఈమెకు హరిద్వార్‌లోని ఫుడ్ అండ్ డ్రగ్స్ శాఖ అధికారులు నోటీసులు పంపారట. ఈ నోటీసులందుకున్న 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెట్టాల్సివస్తుందని ఆమెను నోటీసులో హెచ్చరించారట కూడా. ‘టు మినిట్’ న్యూడిల్ అన్న టైటిల్‌తో వచ్చిన యాడ్‌లో పోషకాహార పదార్ధాలెన్ని? అన్న అంశం వివాదాస్పదమైన విషయం తెల్సిందే! మ్యాగీలో హానికరమైన మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ), సీసం హెచ్చుమోతాదులో వున్నట్లు అధికారులు నిర్థారించారు. దీంతో ఉత్తర ప్రదేశ్ లో ఈ ప్రోడక్టు ను ఉపసంహరించుకోవాల్సిందిగా దీన్ని ఉత్పత్తి చేస్తున్న నెస్లే ఇండియాను అధికారులు ఆదేశించారు. మ్యాగీ ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో వివరించాల్సిందిగా మాధురిదీక్షిత్‌ను వివరణ కోరారు. దీంతో ఆమె చిక్కుల్లో పడింది పాపం...