మహేష్ బాబు ఐపీఎల్ ను కొనడం లేదు

July 17, 2015 | 04:07 PM | 3 Views
ప్రింట్ కామెంట్
maheshbabu_IPL_fake_news_niharonline

ఇటీవలే మహేష్ బాబు సొంత బేనర్ మొదలు పెట్టాడు.  ఈ బేనర్ లోనే శ్రీమంతుడు సినిమా నిర్మాతలలో తనుకూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఇది కాకుండా ఆయన బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టనున్నాడని, అది కూడా తన భావ గుంటూరు ఎంపి అయిన గల్ల జయదేవ్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ కి సంబందించిన వైజాగ్ సిక్సర్స్ ఐపిఎల్ టీంని కొనుగోలు చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ జయదేవ్ గల్ల ఈ వార్తలకి తెరదించేసాడు.
‘నేను మహేష్ బాబు కలిసి ఐపిఎల్ టీంని కొనుగోలు చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మాకు ఐపిఎల్ టీంని కొనడంలో ఎలాంటి ఆసక్తి లేదని’ జయదేవ్ తెలిపాడు. అభిమానుల్లో చర్చనీయాంశంమైన ఈ వార్తతో వాళ్ళకి క్లారిటీ వచ్చింది. శ్రీమంతుడు షూటింగ్ ముగియగానే బ్రహ్మోత్సవం షూటింగ్ రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ఈ బిజీ షెడ్యూల్ లో మరే ఇతర ఆలోచనలు మహేష్ బాబు లేనట్టు గల్ల జయదేవ్ స్పష్టం చేశాడు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ