శ్రీమంతుడి సైకిల్ ప్రభావం...

August 12, 2015 | 04:12 PM | 6 Views
ప్రింట్ కామెంట్
mahesh_babu_srimanthudu_niharonline(3)

సైకిల్ తొక్కడం ఆరోగ్య రీత్యా మంచిదనీ... పొల్యూషన్ తగ్గించవచ్చనీ... ట్రాఫిక్ కూడా అదుపుచేయొచ్చని... కొన్ని దేశాల్లో సైకిల్ నడపాలని ప్రచారం చేస్తుంటే... మన భారత్ లో మాత్రం సైకిల్ దాదాపు కనుమరుగవుతున్నట్టు కనిపిస్తుంది. కాలనీలో పిల్లలు సైకిళ్ళతో ఆడుకోవడం తప్ప, దీన్ని ఉపయోగించే వారి సంఖ్య తగ్గిపోయింది. శ్రీమంతుడు సైకిల్ తొక్కి... ఇలా కూడా ఓ సోషల్ మెసేజ్ అందించాడు. దీంతో కాలేజీ స్టూడెంట్లు, పెద్ద వాళ్ళు కూడా మహేష్ ప్రభావంతో సైకిళ్ళు కొనుక్కోడానికి ఇష్టపడుతున్నారట. ఈ చిత్రం రిలీజయ్యాక సైకిళ్ళ కొనుగోళ్ళు పెరిగాయంటున్నారు. ఇక యువత లోనూ అలాగే పెద్దవాళ్ళు కూడా సైకిల్ కు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఆరోగ్య రీత్యా సైకిల్ తొక్కడం మంచిదని డాక్టర్లు చెబుతున్న ఈరోజుల్లో మహేష్ సైకిల్ తొక్కడంతో కుర్రకారు కూడా మహేష్ లా ఫీల్ అయి సైకిళ్ళ వెంట పడుతున్నారు . ఇదంతా కూడా మహేష్ ప్రభావమే అని అంటున్నారు కుర్రకారు. దీన్ని కూడా ఓ ఉద్యమంలా చేస్తే... ట్రాఫిక్ నూ, పొల్యూషన్ నూ, ఒబెసిటీని కూడా తగ్గించి దేశానికి మేలు చేసిన వాడవుతాడు శ్రీమంతుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ