ఆనందంగా ఉందంటూ మహేష్ బాబు ట్వీట్....

August 07, 2015 | 11:50 AM | 4 Views
ప్రింట్ కామెంట్
mahesh_babu_happy_srimanthudu_success_talk_niharonline

శ్రీమంతుడు  సినిమా చూసిన అభిమానులు బాగుందంటూ మహేష్ ను అభినందిస్తుండడం, థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం, రివ్యూలు కూడా సినిమాకు  అనుకూలంగా వస్తుండడంలో మహేష్ బాబు హాపీగా ట్వీట్ చేశాడు.  ఉదయం బెనిఫిట్ షోలు ముగిసిన తరువాత వెంటనే ప్రేక్షకుల స్పందనలు ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. దీనికి మహేష్ బాబు కూడా రిప్లై ఇస్తూ... "నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఇదొకటి. శ్రీమంతుడు చిత్రానికి చాలా అద్భుతంగా స్పందనలు వస్తున్నాయి... చాలా ఆనందంగా ఉంది... లవ్ యూ ఆల్" (1 of the happiest days of my life .. Overwhelming response for Srimanthudu ..humbled .. Love you all..) అంటూ ట్వీట్ చేసాడు.
హీరో – హీరోయిన్,  డైరెక్టర్, చిత్రంలో మిగిలిన తారాగనం అంతా కొత్త కాంబినేషన్ కావడం... సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించే సూచనలు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ ప్రయత్నం మహేష్ బాబుతో పాటు కొరటాల శివ కూడా చాలా ఆనందించ దగిన సందర్భం.
బాగుందంటూ వచ్చిన స్పందనలు ఎక్కువగానే ఉన్నప్పటికీ... కొందరు మాత్రం కామెడీ లేకుండా సినిమా నడిపించేయడంతో కాస్త లోటు కనిపిస్తోందంటున్నారు. రైటరే డైరెక్టర్ కావడంతో కొన్ని డైలాగులు చాలా బాగున్నాయంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ