ఈ మధ్య అభిమానులతో నేరుగా టచ్ లో ఉండడం ఓ విధంగా మంచి పరిణామమే అయినా, ఏ కాస్త తేడా వచ్చినా యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ మధ్య సమంత మహేష్ పోస్టర్ పై కామెంట్ చేసి మహేష్ అభిమానులకు కోపం తెప్పించింది. ఇప్పుడు అలాంటి వివాదంలో రానా కూడా చిక్కుకున్నారు. బాహుబలి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రానా తన ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యాడు, నెటిజన్లతో టచ్ లో ఉన్న సమయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా రానా కు టచ్ లోకి వచ్చారు . మహేష్ తో నటించే చాన్స్ వస్తే చేస్తారా ? తమ్ముడిగా చేస్తారా ? లేక విలన్ గా చేస్తారా ? అంటూ మహేష్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు దాంతో రానా ''నథింగ్ '' అని సమాధానం చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . ఇంకేముంది దాంతో ట్విట్టర్ లో పెద్ద యుద్దమే జరిగింది . రానా నథింగ్ అని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రానా పై తిట్ల వర్షం కురిపించారు మహేష్ ఫ్యాన్స్. దాంతో రానా కూడా తీవ్రంగా స్పందించాడు ''నథింగ్ అంటే ముందు అర్ధం తెలుసుకోరా ....... ఇంకా కథ లేకుండా ఎలా స్పందించాలిరా ఫూల్ అంటూ విరుచుకు పడ్డారు''. కానీ రానా దీనికి అన్సర్ ఇలా కాకుండా చాలా రకాలుగా ఇవ్వచ్చు కదా.... అలాంటి ఛాన్స్ వస్తే అప్పుడు చూస్తాను కథను, క్యారెక్టర్ ను బట్టి అనొచ్చు. ఛాన్స్ వస్తే చూద్దాం అనొచ్చు. నేను నిర్ణయాలన్నీ ఆ సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాను అనొచ్చు... సింపుల్ గా చూద్దాం అనొచ్చు. కానీ ఇలాంటి ఆన్సర్ ఎందుకు చేసినట్టు? సోషల్ నెట్వర్క్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రానాకు బాగా తెలిసే ఉండాలి కదా?