కన్నయ్య మనసు నిజంగా వెన్న

January 30, 2015 | 01:41 PM | 33 Views
ప్రింట్ కామెంట్

ఈ నటుడికి సినిమా, ఇల్లు తప్ప మరొకటి తెలియదని సినీ రంగం వారి మాట. నిజంగానే వార్తల్లో ఎప్పుడూ వినిపించడు. ఎవరి విషయాల్లోనూ తల దూర్చడు. అలాంటి ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి హాస్యనటుడు అలీ ఓ కార్యక్రమంలో రెండు ముచ్చట్లు చెప్పారు. వినడానికి రెండు మాటలే అయినా అందులో విషయం చాలా ఉందండీ... ఈ నటుడు తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడట. కానీ మహేష్ బాబు వాటిని ప్రచారం చేసుకోడానికి ఎంత మాత్రమూ ఇష్టపడడు. ప్రతి ఏడాది తాను సంపాదించే కోట్ల డబ్బులో 30 శాతం చారిటీలకు వినియోగిస్తాడట. ఓల్డేజ్ హోమ్స్, అనాథ శరణాలయాలకు ఈ సొమ్మును పంపిస్తుంటాడట. ఈ వ్యవహారాలన్నీ సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళ సేవా కార్యక్రమాలు వార్తలు చాలానే వింటున్నాం. వారు వార్తల్లోకి వస్తున్నారు. కానీ మహేష్ మాత్రం ఎప్పుడూ నోరు విప్పలేదు ఈ విషయాల గురించి... నిజంగా ఈయన మనసు చాలా వెన్న. ఈ విధంగా సొంతలాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడితే దేశం కొంత వరకైనా బాగుపడుతుందనిపిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ