రాణీ... రాణమ్మ... అనే పేరు చెప్పగానే ఓ పాత సినిమా పాట గుర్తుకు వస్తోంది. ఆ మరెవరిదో కాదు అర్జున్-కోడిరామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘మాపల్లెలో గోపాలు’ సినిమాను గుర్తు చేస్తోంది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ‘రాణీ రాణమ్మ’యాక్షన్ కింగ్ అర్జున్ తో లక్ష్మీరాయ్ జత కడుతోంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత ఆర్.రామచంద్ర రాజు తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు.. ఈ చిత్రం దాదాపు 60 శాతం పూర్తి కావచ్చిందంటున్నారు. నిర్మాత రామచంద్ర రాజు మాట్లాడుతూ…శ్రీలంక నేపధ్యంలో జరిగే కధ ఇది. ‘తెలుగు రాష్ట్రం లో నివసిస్తున్న ఓ తమిళ యువకుడుకి అమాయకురాలైన ఓ చిన్నపాప పరిచయం అవుతుంది. వారి కుటుంబానికి చాలా దగ్గర అవుతుంది. తెలుగు రాని ఆ పాప తల్లి దండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆ పాప స్వస్థలం శ్రీలంక అని తెలుస్తుంది కధానాయకునికి. ప్రభుత్వ అధికారుల సహకారంతో ఆ పాపను శ్రీలంక కు తీసుకు వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు... శ్రీలంక లో మిలిటరీ అధికారులను కలవడం తదితర అంశాలన్నీ కోడిరామకృష్ణ చక్కగా తెరకెక్కిస్తున్నా’’రన్నారు. ఈ చిత్రం మాతృక ‘కాల్చ'(మమ్ముట్టి, పద్మప్రియ, 3 రాష్ట్ర అవార్డ్ లు గెల్చుకున్న చిత్రం) హక్కులుతీసి కొన్న ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ వద్ద ఈ నిర్మాత ‘తెలుగు, తమిళం’లో హక్కులు తీసుకుని ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట.