అంగరంగ వైభవంగా మంచు మనోజ్-ప్రణీతల పెళ్ళి

May 20, 2015 | 01:08 PM | 43 Views
ప్రింట్ కామెంట్
manch_manoj_marriage_20may_niharonline

ఇప్పటివరకూ సినిమా తారల పెళ్ళిళ్ళు వైభవంగా జరగడం చూశాం కానీ, మంచువారింట్లో పెళ్ళి సందడి దాదాపు పది రోజుల ముందుగానే అన్ని వేడుకలతో అందరినీ అలరించిన అనుభూతి కలిగింది. అంగరంగ వైభవంగా జరిగిన మంచు మనోజ్ పెళ్ళికి సౌత్ సినీ తారలంతా తళుక్కున మెరిసిపారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధమహారథులు ఈ వివాహ మహోత్సవానికి హాజయ్యారు. మనోజ్ పెళ్లిలో రజినీ, బాలయ్య, మహేష్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఇంకా వారి బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులంతా హాజరయ్యారు. వేదమంత్రాలు, మంగళ వాద్యాల మధ్య మంచు మనోజ్ ప్రణతి మెళ్ళో మూడు ముళ్ళు వేశారు. ఈ పెళ్లికి సంబంధించిన లైవ్ కార్యక్రమాన్ని పలు ఛానెల్ వారు ప్రసారం చేస్తున్నాయి. ఈరోజు మనోజ్ పెళ్లి రోజు మాత్రమే కాదు.... ఆయన పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ పెళ్ళి వేడుకను తిలకించడానికి టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు విచ్చేశారు. ఇక సౌత్ సినీ పరిశ్రమ అంతా తరలివచ్చినట్టనిపించింది. ఒక వీరికి తోడు పలు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా హాజరు కావడంతో... ఒక దిక్కు ఘనమైన పెళ్ళి వేడుక మరో పక్క కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. వీరందిరికి సెక్యురిటీ నిమిత్తం ఇప్పటికే దాదాపు 2500కు పైగా గార్డ్ లను నియమించారు. పెళ్లిలో డెకరేషన్ అంతా సినిమా పక్కీలో సినీ ఆర్ట్ డైరెక్టర్లు రూపు దిద్దారు.. ఇక వంటకాల విషయం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇన్నిరాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులకు అన్ని రకాల వంటలు రుచి చూపించారు మంచు వారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ