గతేడాది మోస్ట్ డిజైరబుల్ స్థానంలో ఉన్న మహేష్ బాబును పక్కకు జరిపి ఆ స్థానాన్ని రానా చేజిక్కించుకున్నాడు. ఈ పొజిషన్ సినిమాల విషయంలో కాదండోయ్... టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2014 జాబితాలో రానా నెం.1 స్థానం దక్కించుకున్నాడు. సామాన్య ప్రజల నుంచి ఓపీనియన్ పోల్ నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు వచ్చాయి. తమిళ, మళయాలం హీరోలు అజిత్, దుల్కర్ సల్మాన్ లు కూడా పై స్థానాల్లోనే ఉన్నారు. తెలుగులో రానా, మహేష్ బాబు తర్వాతి స్థానాల్లో ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 7వ స్థానం, హైదరాబాద్ బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో ఉన్నారు. ఇక 9వ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 10వ స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకోగా, అక్కినేని నాగ చైతన్య, నాగార్జున 11, 12 స్థానాలు పొందారు. అయితే మహేష్ బాబు రెండో స్థానంలో ఉండడం ఇక్కడ చర్చనీయాంశం అయ్యింది.