సుకుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇంకా మొదలు పెట్టనే లేదు. వచ్చే వారం షూటింగ్ మొదలవుతుందనుకున్నారు. కానీ దీంట్లో నిర్మాణ భాగస్వామ్యానికి సిద్ధమన్న రిలయన్స్ సంస్థతో ఇంకా డీల్ కుదరలేదట. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఇంతటి భారీ చిత్రం మొదలు పెట్టే సాహసం చేయడం లేదు. ఈ సినిమాకు తప్పనిసరిగా ఒక కార్పొరేట్ సంస్థ సహాయం కావాలట. అందుకే ఈ చిత్రం షూటింగ్ మరోసారి డైలమాలో పడింది. ఈ చిత్రం మొదలు కావడం మరి కాస్త ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది. ఈ లోగా త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. ఆ ప్లాన్ గురించి తెలియగానే సుకుమార్ చిత్రం షూటింగ్‌ని హడావిడిగా స్టార్ట్ చేయాలని చూసారు. కానీ ప్రస్తుతానికి పట్టాలెక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. టెంపర్ రిలీజ్ అయి నాలుగు నెలలు గడిచిపోయినా, ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ కాలేదనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతోంది. దీంతో సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోని ఎన్టీఆర్ కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.