‘ఐ’ ని ఆపి వాటికి అవకాశం ఇవ్వమంటున్నాడు

January 03, 2015 | 11:48 AM | 53 Views
ప్రింట్ కామెంట్

సంక్రాంతికి ఐ చిత్ర తెలుగువర్షన్ మనోహారుడు విడుదల చేయడాన్ని నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా తప్పుబట్టాడు. ముందుగా అనుకున్నట్లు గోపాల గోపాల, టెంపర్ చిత్రాల విడుదలలో జాప్యం అవుతున్నందున పటాస్, బందిపోటు లాంటి చిన్న చిత్రాలకు అవకాశం ఇవ్వాలని ఆయన ఛాంబర్ పెద్దలను కోరారు. పండగల సమయంలో డబ్ చిత్రాలను విడుదల చేయోద్దని గతంలో తీర్మానం చేసుకున్నాం. కానీ, ఇప్పుడు సినీ పెద్దలే ఆ తీర్మానాన్ని తుంగలో తొక్కి ఒక తమిళ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి అనుమతివ్వడం సరికాదన్నారు. అలాగని శంకర్ చిత్రాన్ని అడ్డుకోవటం వెనుక తనకు ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఐ లాంటి టెక్నికల్ వాల్యూస్ ఉన్న మూవీ సెలవుల్లో మాత్రమే కాదు, మరేయితర సమయంలో విడుదల అయిన భారీ కలెక్షన్లు రాబట్టగల సత్తా ఉందని తెలిపాడు. కాబట్టి ఈ సంక్రాంతికి చిన్న చిత్రాల విడుదలకు అవకాశం ఇవ్వాలని ఆయన ఛాంబర్ పెద్దలను కోరాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ