ఎట్టకేలకు మహేష్ వెనక్కి తగ్గాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్ర విడుదలలో నెలకొన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరదించారు. ముందుగా అనుకున్నట్లు ఈ చిత్ర ఆడియోను ఈ నెల 27న, జూలై 17 న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ చివరికి దానిని విరమించుకున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త తేదీలను దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. జులై 18న పాటల్ని, ఆగష్టు 7 న సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ కూడా పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి చిత్రానికి పోటీ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.