నిఖిల్ దీపావళికి వచ్చేస్తున్నాడు...

September 21, 2015 | 05:13 PM | 5 Views
ప్రింట్ కామెంట్
nikhil_shankarabaranam_niharonline.jpg

నిఖిల్ సినిమాలన్నీ రొటీన్ భిన్నంగా వస్తున్నాయి. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. వరుసగా అన్నీ డిఫరెంట్ కాన్సెప్టులే... ఇప్పుడు మళ్ళీ శంకరాభరణం అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతాంజలి వంటి కామెడీ హర్రర్ అందించిన ఉదయ్ నందనవనమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. షూటింగ్ దట్టమైన అడవి ప్రాంతాల్లో తీసినట్టు ఇంతకకు ముందు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ''హార్రర్ కి కామెడీ మిక్స్ చేసి, మేం తీసిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. ఇప్పడు క్రైమ్ లో కామెడీ మిక్స్ చేసి 'శంకరాభరణం' చేశాం. ఇంతకుముందు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్ లోనే తీశాం. బీహార్ లోని డేంజరస్ లొకేషన్స్ లో, పుణేకి దగ్గరలో ఎవరూ చేయని లొకేషన్స్ లో, యూఎస్ లో కొంత భాగం చిత్రీకరించాం. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. కథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి ఇండియాలో అనేక కష్టాలు పడతాడని వివరించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ