హీరోయిన్లను గ్లామర్ కే పరిమితం చేయొద్దు

July 29, 2015 | 04:03 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nitya_menon_gallery_niharonline

ఇప్పుడున్న హీరోయిన్లలో నిత్యా మీనన్ కేవలం పెర్ఫార్మెన్స్ కు ప్రాముఖ్యత నిస్తూ తన స్థానాన్ని తెలుగు, తమిళ, మళయాళం ఇండస్ట్రీలలో పదిలపరచుకుంటోంది. ఇప్పుడు గోల్డెన్ లెగ్ తార అంటే నిత్యామీనన్ అని అంటున్నారంటే... ఇప్పటి వరకూ తన చిత్రాలన్నీ సక్సెస్ బాట నడుస్తున్నాయి కాబట్టే. అయితే ఇప్పుడు ఈ అమ్మడు కూడా దక్షిణాదిన హీరోయిన్లను ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపై మాట్లాడుతోంది. హీరోయిన్ అంటే అందాల ప్రదర్శన అనే దానికి విరుద్ధంగా... నటిగా తనను తాను నిరూపించుకుంటూ వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతోంది. తెలుగు, తమిళం భాషలలో నిత్యామీనన్ కు ప్రస్తుతం భారీ క్రేజ్ ఏర్పడింది. నటిగా తన హవాభావాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. ఇటీవల చాలా మంది తారలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఈమె కూడా సమర్థిస్తోంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం ఎక్కువగా వుందంటూ గతంలో చాలా మంది హీరోయిన్లు పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. నిత్యామీనన్ కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే వుందని ఆరోపించింది. అంతే కాకుండా హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారని, ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం వుందన్నారు. హీరోయిన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలంటూ నిత్యామీనన్ కోరారు. అయితే తాను మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ పాత్రలలో నటించకుండా కేవలం నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రల్లో మాత్రమే చేస్తున్నాననీ, ఈ పద్ధతి ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని అంటోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ