శ్రీమంతుడు సినిమాకు పోలికలొద్దు...!

August 08, 2015 | 03:15 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Sriamthudu_(3)

ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీమంతుడు సినిమా గురించిన చర్చలు బాగా నడుస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్, బడ్జెట్, కథ, హీరో... తదితర అంశాలను ఇతర సినిమాలతో పోల్చడం అనేది సరైంది కాదు. ఇక కొందరైతే కామెడీ లేదనేస్తున్నారు... కథను బట్టి పాత్రలు కానీ... కథకు సంబంధం లేని పాత్రల్ని సృష్టించి సినిమాలో జొప్పించడం ఎందుకు? అంతకు ముందు సినిమాలు కొన్ని ఆరు పాటు, నాలుగు కామెడీ సీన్లు, నాలుగు యాక్షన్ సీన్లు, నాలుగు రొమాంటిక్ సీన్లు అన్నట్టు నడిచాయి..... కథ ఎలా ఉన్నా... మధ్యలో బకరా కమెడియన్లను పెట్టి... కొన్ని కామెడీ బైట్స్ జోడించి సినిమా నడిపించారు. కథ బాగున్నప్పుడు... ఆడియన్స్ అందులో లీనమై పోయి...సినిమా చివరికంటా ఆసక్తిగా చూస్తున్నప్పుడు... మధ్యలో కమెడియన్స్ తో పనేంటి? ఒక సినిమా ఆద్యంతమూ ప్రేక్షకుడిని కట్టిపడేసిందా? లేదా? అనేది పాయింట్ అంతే గానీ అందులో ఇవి లేవు... అవి లేవు... అనడం కరెక్టు కాదు కదా...! శ్రీమంతుడు కాన్సెప్ట్ కొత్తది.... కథ నడిపిన విధానం కూడా కొత్తగా ఉంది. ఇక మహేష్ బాబు, జగపతి బాబులు తండ్రీ కొడుకులుగా బాగా ఆకట్టు కున్నారు. అంతకు ముందు జగపతి బాబు విలనీ క్యారెక్టర్ రోల్స్ రెండు చేసినా... పాత్ర పరంగా అంతగా హైలైట్ కాలేదనే చెప్పాలి. ఇందులో ఆయనకు మంచి రోల్ పడింది. తండ్రి పాత్రే అయినా, సెకండ్ హీరో అనిపించు కున్నారు. డైరెక్టరే రైటర్ కావడంతో ఇద్దరు హీరోల మధ్య డైలాగులూ చాలా క్యాచింగ్ గా ఉన్నాయి. ఏ విధంగా చూసినా సినిమా ఇటీవల సినిమాలకు భిన్నంగా ఉండడమే కాదు.... ఓ సామాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాగా,  ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా శ్రీమంతుడు మిగిలిపోతుంది. ఈ సినిమాకు మరే సినిమా పోలికా కాదు... సాటి రాదు కూడా. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ