పీకే ఓ కాపీ పేస్ట్ కథా?

January 21, 2015 | 12:34 PM | 20 Views
ప్రింట్ కామెంట్

అమీర్ పీకే సినిమా ఎన్నో బాలారిష్టాలను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఇన్ని అవాంతరాలు ఎదురైనా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ రికార్డుని బద్దలు కొట్టి 650 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు అమీర్ సినిమా ధూమ్ 3 రికార్డుల్ని ఈ సినిమా చెరిపేసింది. మొదట్లో అమీర్ పోస్టర్ ఒక సంచలనమయితే, ఆ తరువాత దేవుళ్ళను విమర్శించిన సినిమా అంటూ మరో వివాదం చెలరేగింది. కొత్తగా ఈ కథ గురించి ఒక రచయిత ఇది నా నవలంటూ కోర్టును ఆశ్రయించాడు. కపిల్ ఇసాపురి అనే ఈ రచయిత తను రాసిన హిందీ నవల ‘ఫరిస్తా’ నుంచి కాపీ చేశారని వాదిస్తున్నాడు. ఈ నవల 2009లో పూర్తి చేశాడట. 2013లో ప్రచురించబడిందంటున్నాడు. తన నవలలోని 17 సన్నివేశాల్ని కాపీ కొట్టారని అంటున్నాడు. పీకే సినిమా నిర్వాహకులకు నోటీసులు కూడా పంపించి, ఈ కథను కాపీ చేసినందుకు గాను తనకు కోటి రూపాయలు చెల్లించాలని అడుగుతున్నాడు. ఈ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి, రచయిత జోషి, విధువినోద్ చోప్రా ఈ విషయమై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ