నార్త్-సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా విశేషమైన పాపులారిటీ ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లేటేస్ట్ చిత్రం ‘పీకే’ శుక్రవారం విడుదలైంది. అయితే ఈ చిత్రం సోమవారం నాటికి వంద కోట్ల మార్క్ ను చేరుకోగలిగింది. పీకే సినిమా అద్భుతమైన సినిమా అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఐతే. సెంచరీ కోసం నాలుగు రోజులు తీసుకోవడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. రికార్డు స్థాయిలో ఈ సినిమాను 6 వేల థియేటర్లలో విడుదల చేశారు. అయినప్పటికీ తొలి రోజు రూ.30 కోట్లే వసూళ్లే సాధించింది. ఇక రజనీ కాంత్ ‘లింగ’ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ మూడో రోజుకే వందకోట్ల ఫీట్ ను సాధించిందనే ప్రచారం జరిగింది. సెంచరీ కొట్టడం గురించి కొంచెం సందేహాలున్నప్పటికీ లింగ కనీసం రూ.90 కోట్ల దాకా వసూలు చేసిందన్నది స్పష్టం. ఏడాది కిందట విడుదలైన అమీర్ సినిమా ‘ధూమ్-3’కి అప్పట్లోనే రూ.36 కోట్ల వసూళ్లు వచ్చాయి. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్ ఏకంగా తొలి రోజు రూ.45 కోట్ల దాకా వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే పీకే క్లాస్ సినిమా కావడంతో మాస్ సెంటర్లలో కలెక్షన్లు తక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చు.