‘సర్దార్’ కు హీరోయిన్ వేట...

July 28, 2015 | 04:19 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pawan_kalyan_heroin_not_fix_niharonline

గబ్బర్ సింగ్ 2 ఏ ముహూర్తానా మొదలు పెట్టారో గానీ ఒకటి కుదిరితే మరొకటి జారిపోతోంది... దీంతో రెండేళ్ళుగా అనుకుంటున్న ఈ సినిమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పవన్ అభిమానులకు ఇప్పుడు నీరసం ముంచుకొస్తోంది. ఈ సినిమా మొదలు పెట్టేదెప్పుడు రిలీజయ్యేదెప్పుడు అని. సినిమాకు జరిగినంత హీరోయిన్ వేట మరే సినిమాకు జరగలేదేమో... సంపత్ నంది ఇప్పటికి ఎన్ని లెక్కలేనన్ని ఆల్బమ్ లు చూశాడట. ఆఖరికి సోనాక్షిసిన్హా అనుకున్నారు.  ఆ అమ్మడు డేట్లు ఇదిగో అదిగో అంటూ చివరకు నో చెప్పేసింమదట. మళ్లీ ముంబాయిలో వేట ప్రారంభించి విసిగిపోయారు. చివరకు పవన్, వున్నట్లుండి, అనీషా అంబ్రోస్ ను హీరోయిన్ గా ఎంపిక చేసి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. హమ్మయ్యా హీరోయిన్ దొరికింది అనుకుంటే డైరెక్టర్ మారిపోయాడు. సరే, సెట్ మీదకు వెళ్ధాం అనుకుంటే, ఇప్పుడు హీరోయిన్ మారిపోయింది. మళ్లీ వేట మొదలయింది.  విపిస్తున్న వార్తల ప్రకారం పవన్ కు ఇరవై, ఇరవై రెండేళ్ళ అమ్మాయినే హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఏజ్ ఉండాలన్నట్టు చెప్పాడని టాలీవుడ్ టాక్. సర్దార్ షూటింగ్ మాత్రం 29న మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ