రానాను పొగిడిన పవన్ కళ్యాణ్

July 15, 2015 | 11:35 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Pawan_praises_bahubali_ballaladeva_niharonline

బాహుబలి సినిమా గురించిన చర్చలు ఒక పక్క జరుగుతుంటే ఈ సినిమాను గురించి ఎవరెవరు ఎలా స్పందించారనేది మరో పక్క జరుగుతున్న చర్చనీయాంశం... సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకుల మధ్య పోటీ తత్వం అనేది బయటికి కనిపించినా... కనిపించకపోయినా బాగా ఉంటుందనేది వాస్తవం. రాంగోపాల్ వర్మ డైరెక్ట్ గానే అందరూ జలసీ పడతారని చెప్పేశారు. దీంతో స్టార్ డైరెక్టర్లూ, హీరోలు ఈ సినిమా గురించి ఏం చెపుతారో అని సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ ఉత్సుకతో ఎదురు చూడ్డం సహజం. పొగడ్తలతో ఈ టీం ఉబ్బితబ్బిబ్బవుతుంటే... తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ చిత్రాన్ని చూసిన వెంటనే రానా ని పిలిచి, అబినందనలతో ముంచెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇంత ఘన విజయం సాధించినందుకు టీంకు కూడా అభినందనలు తెలియచేసినట్లు తెలుస్తోంది. పవన్ పొగడ్తలతో రానా ఆనందంలో మునిగి పోయినట్టు చెప్పుకుంటున్నారు.  ఈ విషయాల గురించి రానా స్వయంగా తెలియజేస్తే అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిపోయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ