సినిమాల్లోకి ఎంటరై దాదాపు 15 సంవత్సరాలు కావస్తోంది ప్రభాస్. ఈయనతో సినీ కెరీర్ ప్రారంభించిన... ఆ తరువాత వచ్చిన వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళయిపోయాయి. ఇప్పటివరకూ బ్యాచ్ లర్ హీరోగా ఉన్న ఈయనకు లేడీ ఫాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే వీరి హృదయాలు బ్రేకయ్యే ఓ వార్త ఏమిటంటే ప్రభాస్ ఓ ఇంజనీరింగ్ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడట. ఈయన పెళ్ళి గురించి ఇటు ఇండస్ట్రీలోనూ... అటూ ఆడియన్స్ లోనూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారూ ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్ళికి సంబంధించిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. వినిపిస్తున్న సమాచారం బట్టి రెబెల్ స్టార్ ఫామిలీ ఇప్పటికే ఒకమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టారట. ఆ అమ్మాయి భీమవరానికి చెందిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మా ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ బాహుబలి 2 పూర్తి చేసిన తరువాత పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాడు. ఈ లోగా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కూడా పూర్తి చేస్తుందట. ఈ వార్తే నిజమయితే ప్రభాస్ నిశ్చితార్థం డిసెంబర్ లో జరుగుతుందని అనుకుంటున్నారు.