అడవి శేషు హీరోగా ‘కిస్’ సినిమాలో, సందీప్ కిషన్ తో ‘జోరు’లో నటించిన బ్యూటీ ప్రియా బెనర్జీ ఏకంగా జాక్ పాట్ కొట్టేసింది. ఈమెకు ఇప్పుడు ఐశ్వర్యతో నటించే అవకాశం వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. కెనడాలో పుట్టి పెరిగిన బెంగాలీ అమ్మాయి ప్రియ నటించింది ఈ రెండు సినిమాలే, అవి కూడా పెద్దగా సక్సెస్ సాధించనివి. దీంతో తెలుగులో ఈమెకు ఆఫర్లేవీ రాలేదు. అయితే ఇప్పుడు ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రధారిణిగా సంజయ్ గుప్తా రూపొందిస్తున్న ‘జాజ్బా’ చిత్రంలో నటిస్తోంది. ఈ ఛాన్సు కూడా ఈమెకు గారెల బుట్టలో పడ్డట్టు దక్కిందట. సంజయ్ గుప్తా ట్విట్టర్ అకౌంటుకు ప్రియా బెనర్జీ వీడియోను ఎవరో ట్యాగ్ చేశారట. అది చూసిన సదరు దర్శకుడు వెంటనే ఆమెను రప్పించి స్క్రీన్ టెస్ట్ చేసి తన సినిమాకు బుక్ చేసుకున్నాడని సమాచారం.