ప్రేమ ముచ్చట్లు చెప్పిన ప్రియమణి

July 14, 2015 | 04:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
priyamani_priyamani_niharonline

మళయాళీ అమ్మడు ప్రియ మణి చివరికి తన ప్రేమ విషయం బయట పెట్టింది. గత కొంత కాలంగా తనపై మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని బలపరుస్తూ తన చెలికాడి పేరు చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్, అగ్ర హీరోల సరసన నటించిన బ్లాక్ బ్యూటీ టీవీలో దుర్గ నెయ్యితో అందరినీ పలకరిస్తుంది తప్ప తెలుగు సినిమాకు పూర్తిగా దూరమైంది. ఈ అమ్మడికి టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోవడంతో తన సొంత గూటికి చేరిపోయింది. కన్నడంలో ఈ అమ్మడు అడపదడపా సినిమాల్లో నటిస్తూ, అక్కడ ఓ ఛానెల్లో ప్రసారమయ్యే డాన్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తుంది.
అయితే ఈ అమ్మడి సినిమా విషయాలు కాస్త పక్కనపెడితే... గతకొద్ది కాలంగా ప్రియమణి ఎవరితోనో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ వస్తున్న వార్తలకు స్వయంగా ప్రియమణియే స్వస్తిపలికింది. తాను ముస్తాఫా రాజ్ అనే వ్యక్తితో ప్రేమలో వున్నట్లు ప్రియమణి తెలిపింది. ఇంకా తన ప్రేమ కబుర్లు చెబుతూ... ముంబైలో రాజ్ పెద్ద ఈవెంట్ మేనేజర్ అని, సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో తనతో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాము మంచి స్నేహితులుగా వున్నామని, కానీ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడ్డామని, అయితే తానే ముందుగా ప్రపోజ్ చేసానని, ఆ తర్వాత అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని చెబుతోంది. అయితే ఇరుకుటుంబ సభ్యుల నుంచి కూడా అమోదం లభించిందని, కానీ ఇప్పట్లో తమ పెళ్లి లేకపోయినప్పటికీ, ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామని ప్రియమణి స్పష్టం చేసింది. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ