ఇప్పుడున్న నిర్మాతల్లో చాలా వరకు మొదట ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వారే... నెమ్మదిగా సినిమా నిర్మాణంలోకి దిగిపోతారు. అలాంటి వారిలో సాయి కొర్రపాటి ఒకరు. ఈయనదో ప్రత్యేక వ్యక్తిత్వంగా సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ ఈగతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి రాజమౌళికి చాలా సన్నిహితుడయ్యాడు. ఇప్పుడ బాహుబలి సినిమాకు సీడెడ్, బెంగళూరు, కృష్ణా జిల్లా హక్కులు తీసుకున్నారట. అయితే బాహుబలికి వచ్చిన క్రేజ్ కు ఆయనకు బెంగుళూరు ప్రాంతానికి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కొన్న మొత్తానికి మరో ఆరు కోట్లు అదనంగా ఇస్తామన్నారట. దాంతో ఆయన బెంగుళూరు హక్కులను ఇచ్చేసారని చెప్పుకుంటున్నారు. ఇవ్వడం వరకయితే ఓకే గానీ, అలా వచ్చిన లాభంలో బాహుబలి నిర్మాణ సంస్థ కు మూడు కోట్లు షేర్ ఇచ్చేశాడట. ఈ లాభంలో వారిది కూడా వాటా ఉంటుందని ఆయన ఉద్దేశమని చెప్పుకుంటున్నారు. ఇదెంత వరకు నిజమనేది తెలియదు గానీ... వార్త ఇలా బయటికి వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఇలా ఉంటుందనేది మాత్రం నిజమనిపిస్తోంది కదా..!