దగ్గుబాటి రానాతో చేయాలకున్న రాంగోపాల్ వర్మ ప్రాజెక్టు ఎట్టకేలకు మంచు మనోజ్ తో చేయడానికి రెడీ అయిపోయారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందట. బుధవారం ఈ సినిమాలో నటించ బోతున్న నటుల ఫొటోలను విడుదల చేశారు. ఇది కూడా ఆర్జీవీ మార్క్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ బేస్ తో రూపొందించనున్నట్టు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ ఈ ప్రాజెక్టును దగ్గుబాటి రానాతో చేయాలని అనుకున్నారు. రానా హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నందు వల్ల ఈ సినిమాకు మనోజ్ కు అవకాశం ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకూ చేసిన శివ, ది కంపెనీ, సత్య సినిమాలు అండర్ వరల్డ్ బేస్ తో తీసినవే, రానాకు ఈ స్క్రిప్టు నచ్చినట్టు రాంగోపాల్ వర్మ చెప్పిన వార్త కూడా లోగడ పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అతి త్వరలో మంచు మనోజ్ తో సెట్స్ పైకి తీసుకువెళ్ళబోతున్నారు. రాంగోపాల్ వర్మ తో మోహన్ బాబు, విష్ణు మంచుతో 2014లో ‘రౌడీ’ ‘అనుక్షణం’ అనే సినిమాలు చేశారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మరొకరికి ఆయనతో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. వర్మ దర్శకత్వంలో పనిచేసే అవకాశం దొరకటం చాలా ఎగ్సైటింగ్ గా ఉందనీ,, చాలా గర్వంగా కూడా ఉందని, ఆయన టేకింగ్ టెక్నికల్ గా చాలా బాగుంటుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సురభి (బీరువా ఫేం), జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు ఇంకా మరికొందరి నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయింది. చాలా రోజుల తర్వాత నటుడు వడ్డే నవీన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.