నటి రాధిక కూతురి వివాహం క్రికెటర్ తో

September 11, 2015 | 05:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
radikaa-rayane-abhiamanyu_niharonline

ఒక నాటి హీరోయిన్ రాధిక కూతురు రయానే ప్రేమ వివాహం క్రికెటర్ తో జరగబోతుంది. పెద్దల అంగీకారంతో ఈ నెల 23న ఆమె నిశ్చితార్థం జరుపుతున్నట్టు తెలుస్తోంది. క్రికెటర్ అభిమన్యు మిథున్‌, రయానేలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచుల్లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరుపున అభిమన్యు ఆడుతున్నాడు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా స్నేహం కొనసాగుతోందట. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పి ఒప్పించారు. పెద్ద వాళ్ళు ఈ పెళ్ళికి అంగీకరించి నిశ్చితార్థానికి పూనుకున్నారు. వివాహం ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. రయానే రాధిక ప్రొడక్షన్ కంపెనీ బాధ్యతలను నిర్వహిస్తోంది. రాడాన్ మీడియా సంస్థ నిర్వహణ బాధ్యతల్లో రయానే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ