నిన్న విడుదలైన ‘బాహుబలి’ అఫీషియల్ పోస్టర్ కాపీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకు ముందు కూడా రాజమౌళి ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉన్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే దీని పై విమర్శలు తలెత్తాయి. ఈ పోస్టర్ 1998లో వచ్చిన ‘సిమన్ బిర్చ్' అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అంటున్నారు. సోషల్ నెట్వర్క్ లో రాజమౌళి పై మాటల యుద్ధం మొదలైంది. ఈ సినిమా మేకింగ్ వీడియో పై కూడా జక్కన్న కాపీ చేశాడంటూ విమర్శలు వచ్చాయి. ఈ వమర్శలకు రాజమౌళి స్పందిస్తూ కాపీ వేరు స్పూర్తి వేరు అంటూ వివరణ కూడా ఇచ్చాడు. ఇలా వివరణ ఇచ్చినప్పటికీ, ఏదో ఒక ఇష్యూపై పనిగట్టుకుని విమర్శలు చేస్తూనే ఉన్నరు. అయినా ఒక సంఘటన, ఓ ద్రుష్యం, ఓ వివాదం, ఓ పరిష్కరాం... ఇలా ఎన్నింటి నుంచో మనకు కొత్త ఆలోచనలు పుట్టుకు రావడం సహజం.... నిజంగానే ఇది కాపీ అని ఎందుకనుకోవాలి... అది బాగా నచ్చి అలాగే ఇంకొకటి తయారు చేయకూడదనే నిబంధనలు ఏమీ లేవుగా... అంత మాత్రం చేత కాపీ లని విమర్శించడం తగదు కదా... ఓ మంచి పనిని, క్రియేటివిటీని... శ్రమను అభినందించాలే గానీ ఎప్పుడూ దర్శకుల పై కాపీ లు చేస్తూన్నారంటూ విమర్శించడం మన తెలుగు వారికి మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. మరి ఈ విమర్శలకు రాజమౌళి ఏమని సమాధానం చెబుతారో చూద్దాం...