బాహుబలి చిత్రం విడుదలకు ముందే రాజమౌళి రేంజ్ రెండింతలైంది. మగధీరతో 75 కోట్ల విజయాన్ని చవిచూసిన రాజమౌళి ఈసారి 150 కోట్లు సాధించేస్తాడని అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగులోనే వంద కోట్ల షేర్ రావచ్చనుకుంటున్నారు. అయితే రాజమౌళికి మహాభారతాన్ని తెరకెక్కించాలనే ఎప్పటినుంచో ఓ కోరిక అట. కానీ అంత బడ్జెట్‌తో సినిమా తీయాలంటే ఒకే భాషలో తీస్తే కుదరదు. బాలీవుడ్‌లో భారీ తారాగణంతో ఆ చిత్రం చేయాలని రాజమౌళి అనుకుంటున్నాడట. బాహుబలి కనుక తను అనుకున్న స్థాయి విజయాన్ని సాధిస్తే, తనతో మహాభారతం చేయడానికి ఏ నిర్మాణ సంస్థ అయినా ముందుకు రావచ్చని, అంతర్జాతీయస్థాయిలో ఆ చిత్రాన్ని చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇంతకుముందే ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్‌ఖాన్‌తో రాజమౌళి డిస్కస్ చేసాడట. బాహుబలి కారణంగా రాజమౌళి ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. బాహుబలి రెండో భాగాన్ని కూడా పూర్తి చేసే నాటికి తనపై వున్న అంచనాలకి తగ్గ దర్శకుడిగా రాజమౌళి నిలబడితే కనుక తన భారతం కల నెరవేరే రోజు చేరువలోఉంది. అయిదు వందల కోట్లతో తీసినా, అయిదు భాగాలుగా తీసినా బాలీవుడ్‌లో ఈజీగా వర్కవుట్ అవుతుంది. ఇప్పటి వరకూ ఓటమి తెలియని ఈ దర్శకుడికి ఇది కూడా సాధ్యమవుతుందనే అనుకుందాం...