అవసరమైతే ‘బాహుబలి 2’ను జక్కన్నమళ్ళీ చెక్కుతారట

July 17, 2015 | 01:13 PM | 4 Views
ప్రింట్ కామెంట్
rajamouli_about_part_2_story_niharonline

బాహుబలి సినిమా రెండు పార్ట్ లుగా విడుదలవుతుంది కాబట్టి దీని గురించిన చర్చలు ఇంకో సంవత్సరం వరకూ కొనసాగుతూనే ఉంటాయనడంలో అతిశయోక్తి కాదేమో... ఇప్పటికే పార్ట్ 2 గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. పార్ట్ 1 విడుదలై ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు బిజినెస్ ప్రముఖులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.  ఇంతకన్నా గొప్పగా తెరమీద చూపించడానికి రాజమౌళి సెకండ్ పార్ట్ గురించి ఆలోచనలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అవసరమైతే సెకండ్ పార్ట్ అనుకున్న కథలో కాస్త మార్పులు కూడా చేయవచ్చునని. అయితే ఇది కూడా మొత్తం రెస్పాన్స్ చూసుకుని మార్పులు చేస్తానని చెప్పారు. ఆయన ఈ ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ 40 శాతం మాత్రమే పూర్తి చేసినట్టు తెలిపారు. మిగితా భాగం ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని ఒక సంవత్సరంలో మరో పార్ట్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ