హెడ్డింగ్ చదివితే ఏమనిపిస్తుంది... నిజమే కదా... దర్శకుడికి బాగా నటన వచ్చి ఉంటేనే అది నటుల నుంచి రాబట్టుకోగలుగుతారు... అని అనుకుంటాం... కానీ రాజమౌళి చెప్పేది ఈ విషయం గురించి కాదు. బాహుబలి షూటింగ్ అయిపోయే సమయం దగ్గర పడుతున్నప్పుడు తను చాలా టెన్షన్ కు గురయ్యాడట. అది మళ్ళీ అందరికి తెలియకూడదని ముఖం మీద నవ్వుపులుముకుని టెన్షన్ తెలియకుండా నటించడాన్ని గురించి చెబుతున్నాడాయన. ప్రశాంతత అనే ముసుగు వేసుకుని కనిపించేవాడట. ఇది నటనే కదా అని ఆయన ఉద్దేశం. అంత భారీ సినిమా తీస్తున్నపుడు లేని వత్తిడి, విడుదల సమయంలో తమ బృందాన్నంతా ఊరికే డనివ్వట్లేదని రాజమౌళి చెప్పాడు. సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ ఉన్నా, వత్తిడి మారతం తప్పట్లేదన్నాడు రాజమౌళి. బాహుబలి 80 శాతం పూర్తయ్యే వరకు చాలా ఉత్సాహంగానే ఉన్నామని, చివరి 20 శాతం చిత్రీకరించాల్సి ఉన్నపుడు యూనిట్ సభ్యుల్లో కొంచెం ఉత్సాహం తగ్గడం గమనించానని, ఇదే విషయాన్ని సెంథిల్ తో చెబితే, నన్ను చూసే వాళ్ళంతా ఉత్సాహం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడని, దాంతో తనలో ఉత్సాహం తగ్గడం కనిపించకుండా ముఖానికి మాస్క్ వేసుకుని పని చేశానని చెప్పారు రాజమౌళి. అదండీ తన నటన గురించి జక్కన్న ఇచ్చిన క్లారిఫికేషన్.