రజనీకాంత్ సినిమాకు లైన్ క్లియర్...

August 31, 2015 | 02:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rajanikanth_kabali_niharonline

లింగ సినిమా తరువాత రజనీకాంత్ ఓ యువ డైరెక్టర్ తో సినిమాకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు టైటిల్ వివాదం ఏర్పడిన విషయం కూడా వార్తల్లో వచ్చింది. ఇప్పుడు నిర్మాత కలైపులి దామ కల్పించుకుని టైటిల్ వివాదాన్ని పరిష్కరించుకున్నాడు. సెప్టెంబరు 17న వినాయకచవితి సందర్భంగా సూపర్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కబాలి’ని సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఈ టైటిల్ ను శివకుమార్ అనే ఓ నిర్మాత కొన్నేళ్ళ క్రితం రిజిస్టర్ చేయించాడు. ఆ పేరుతో సినిమా కూడా మొదలుపెట్టాడు. కానీ సినిమా పూర్తి కాకుండా మధ్యలో వదిలేశాడు. రజినీకాంత్ సినిమాకు ‘కబాలి’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే.. ఇది నా టైటిల్ అంటూ అడ్డం పడ్డాడు. ఐతే నిర్మాత థాను శివకుమార్ తో మాట్లాడి వివాదాన్ని సెటిల్ చేసుకున్నాడు. దీంతో రజినీ సినిమాకు లైన్ క్లియరైంది. అట్టకత్తి, మద్రాస్ లాంటి సినిమాలతో హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా మంచి పేరున్న రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రజినీకాంత్ వయసుకు తగినట్టే కనిపిస్తాడట.ఈ సినిమాలో.  ప్రకాష్ రాజ్ జేడీ చక్రవర్తి లాంటి ప్రముఖులు కూడా కనిపిస్తారు. ఇక హీరోయిన్ సంచలన కథానాయిక రాధికా ఆప్టే. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. కథా ప్రకారం ఈ సినిమాను మలేషియాలో కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉండగా, మొదటి షెడ్యూల్ అక్కడే చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్ర బృందం మొదటి  షెడ్యూల్ చెన్నైలో తీయబోతున్నారు. చెన్నైలో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్ర టీం మలేషియాకి వెళ్లనుంది. ఈ సినిమాలో రజినీకాంత్ స్టైలిష్ హెయిర్ స్టైల్ మరియు వైట్ గడ్డం లుక్ లో కనిపిస్తాడు. షూటింగ్ మొదలు పెట్టే రోజున ‘కబాలి’ స్టిల్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ