యాంగ్రీ యంగ్ మ్యాన్ మళ్లీ గతంలోకి...

February 11, 2016 | 11:26 AM | 3 Views
ప్రింట్ కామెంట్
rajashekar-villan-teja-aham-niharonline

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ తనయుల హవా కొనసాగుతున్న టైంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా క్యారెక్టర్లతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రాజశేఖర్ మొదట్లో చిన్నచితకా క్యారెక్టర్లు చేశాడు. ఆపై నెగటివ్ రోల్స్, అటుపై సోలో హీరోగా భారీ హిట్లే అందుకున్నాడు. రాఘవేంద్ర రావు లాంటి టాప్ డైరక్షన్లో పలు బ్లాక్ బస్టర్లు కూడా అందించాడు.

అయితే ఎవడైతే నాకేంటి సినిమా తర్వాత ఆయన సినిమా ఒక్కటి అంటే ఒక్కటీ ఆడలేదు. ఆ మధ్య సీతమ్మ వాకిట్లో చిత్రంలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ చేయాల్సిందిగా దిల్ రాజు కొరితే సున్నితంగా తిరస్కరించాడంట. ఇక ఇప్పుడు ఓ హిట్ కోసం మళ్లీ గతంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వివరంగా చెప్పాలంటే, తన కెరీర్ ప్రారంభంలో 'ఆహుతి', 'తలంబ్రాలు' వంటి సినిమాల్లో నెగటివ్ టచ్ వున్న పాత్రలు పోషించిన సంగతి విదితమే.

                      అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ నెగటివ్ పాత్ర పోషించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందే 'అహం' అనే సినిమాలో రాజశేఖర్ విలన్ గా ఓ పవర్ ఫుల్ రోల్ వేస్తున్నాడు. ఇందులో ఆయన సరసన ఓ ప్రముఖ నటి నటించబోతుందట.  ఓ యువ జంట హీరోహీరోయిన్లుగా నటించబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలో తెలియజేయనున్నట్లు తేజ ప్రకటించాడు. మరి జగపతి బాబులాగా ఈయన కూడా నెగటివ్ రోల్ లో క్లిక్ అవుతాడో లేదో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ