రజినీకి మళ్ళీ నోటీసా? అది కూడా వియ్యంకుడి వల్ల...!!!

June 23, 2015 | 11:47 AM | 1 Views
ప్రింట్ కామెంట్
kasturiraja_rajanikanth_case_niharonline

ఏంటో సూపర్ స్టార్ రజనీకాంత్ కు 2015 ఏం బాగా లేనట్టుంది. ఒక వివాదం సమసిపోతుందనుకునే లోపు మరో వివాదం తలెత్తుతోంది. ఆయన ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. లింగ సమస్య సినిమా సమస్య ఇంకా తీరనే లేదు. మళ్ళీ ఈయనపై మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రజనీకాంత్ వియ్యంకుడు, ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ తండ్రి అయినటువంటి కస్తూరి రాజా 2012లో ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమా నిర్మాణం కోసం ముకుంద్ బోత్రా అనే ఫైనాన్సియర్ దగ్గర రుణం తీసుకున్నాడట. దీనికి సంబంధించి ఒక నోటీసు రజనీకాంత్ కు వచ్చింది. దానర్థం ఏమిటంటే...? కస్తూరి రాజా 2012లో ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమా నిర్మాణం కోసం తన వద్ద 40 లక్షలు రుణం తీసుకున్నాడు... ఆ తర్వాత మరో 25 లక్షలు రుణం గాడు.  ఈ డబ్బు తాను  చెల్లించలేని పక్షంలో తన కొడుకు, లేదా మామ అయినటువంటి రజనీకాంత్ చెల్లిస్తారని హామీ ఇచ్చారు.’ అని ముకుంద్ బోత్రా కేసులో వివరించాడు. అయితే కస్తూరి రాజా ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ముకుంద్ బోత్రా ఫిర్యాదు చేసారు. దీంతో ముకుంద్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ కోసం జడ్జి, మరి ఈ కేసులో వియ్యంకులతో పాటు యువ హీరో ధనుష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ