తెలుగు వాళ్ళు ఇతర భాషలు నేర్చుకోవడం తేలికేగానీ, ఇతర భాషల వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కొద్దిగా కష్టమే... ఇటీవల వస్తున్న హీరోయిన్లు తెలుగు చాలా ఫాస్ట్ గానే నేర్చుకుంటున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ అయితే మొదటి సినిమాతోనే దాదాపు విని ఆన్సర్ చేయగలిగేంత నేర్చేసుకుంది. ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ చాలా మంది హీరోయిన్లు డబ్బింగ్ జోలికి వెళ్ళరు. పదేళ్ళయినా ఇప్పటికీ తెలుగులో నటిస్తున్న తెలుగురాని ముద్దుగుమ్మలు ఉన్నారు. వాళ్ళు రకుల్ ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగమ్మాయిలా మాటాలడేస్తుందట. ఢిల్లీకి వెళ్లినా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ `ఎలా ఉన్నారు?` అంటూ మాట్లాడేస్తోందట. అది చూసి అందరూ షాక్ అవుతున్నారట. తెలుగు అమ్మాయివి అయిపోయావంటున్నారట. అయితే తన తెలుగు ముచ్చట గురించి చెపుతూ... తెలుగులో తన డబ్బింగ్ చెప్పుకోవాలనే కోరిక బాగా ఉందని అంటోందట. తన తెలుగును తానే తెరమీద చూసుకోవాలనే కోరికతో ఉందట రకుల్ ప్రీత్ సింగ్. రాబోయే సినిమాలో తనతో డబ్బింగ్ చెప్పించుకుంటే బాగుండని అనుకుంటోందట. ఇప్పుడు తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఒకటి ఎన్టీఆర్ తో, మరొకటి రాంచరణ్, అర్జున్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాల్లో తనకు తాను డబ్బింగ్ చెప్పుకునే ఛాన్స్ ఎవరిస్తారో చూడాలి.