ఎక్స్ పోజింగ్ కు రకుల్ చెప్పిన అర్థం....

May 19, 2015 | 04:07 PM | 64 Views
ప్రింట్ కామెంట్
Rakul_Preet_Singh_Hot_niharonline

అతి తక్కువ కాలంలో బాలీవుడ్ టాప్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ముంబయి భామ రకుల్ ప్రీత్‌సింగ్. ఈ అమ్మడు వరసగా హిట్లు కొడుతూ పెద్ద పెద్ద హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. ఒక దశలో టాప్ హీరోయిన్లు వదులుకున్న ఛాన్సులు ఈ అమ్మడి సొంతమయ్యాయి. అయితే ఈ అమ్మడు ఎక్స్‌ పోజింగ్‌ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ టాపిక్ అయిపోయింది. ఈమె నటించిన ‘పండుగ చేస్కో’ చిత్రం ఈనెల 29న విడుదల అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ మూవీలో రకుల్ ఎక్స్‌ పోజింగ్ పెంచేసిందన్న వార్తల వచ్చాయి. అయితే దీనికి అమ్మడి స్పందన ఏమిటంటే... చాలామంది హీరోయిన్స్ గ్లామరస్‌గా కనిపించడానికి ఇదొక్కటే ఏకైక మార్గమని అనుకుంటారనీ, తన దృష్టిలో గ్లామర్ వేరు.. ఎక్స్‌ పోజింగ్ వేరంటూ వ్యాఖ్యానించింది. తాను గ్లామర్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తాను కానీ, ఎక్స్‌ పోజింగ్ మాత్రం చేయనని అంటోందట. దీంతో రకుల్ చేసిన కామెంట్లకు నెటిజన్ల నుంచి బోలెడు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లకు ఎక్స్‌ పోజింగ్ అనేది కామన్‌గా మారిపోయిందని అంటున్నారు. మరోవైపు వరస ఆఫర్లు రావడంతో రెమ్యునరేషన్‌ని కోటికి పెంచేసిందట రకుల్ పైగా ఇలాంటి కామెంట్లు చేయడంతో నిర్మాతలు డైలమాలో పడుతున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ