నిత్యం సంచలన వార్తలతో ప్రజల నోళ్లలో నానే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సెన్సెషన్ స్టేట్ మెంట్ తో మీ ముందుకు వచ్చాడు. దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సునంద పుష్కర్ హత్యోదంతంపై సినిమా తీసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. మాజీ ఎంపీ శశిథరూర్ భార్య అయిన సునంద అనుమానాదస్పద స్థితిలో మ్రుతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు మిస్టరీ వీడలేదు. అయితే ఇప్పటికే చిక్కుల్లో ఉన్నా ఎందుకు అనుకున్నాడో ఏమో... కేసులో చిక్కుముడి వీడిన తర్వాతే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తానని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం ఓ చిత్ర షూటింగ్ దశలో ఉన్నందున ఆ లోపు దీని సంగతేంటో తేలిస్తే తన చిత్రాన్ని ప్రారంభించుకుంటానని వర్మ అంటున్నాడు. గతంలో కేరళలో జరిగిన ఓ రియల్ ఘటన ఆధారంగా తెరకెక్కించిన నాట్ ఏ లవ్ స్టోరీ, ముంబై దాడుల నేపథ్యంలో వచ్చిన 26/11 చిత్రాలు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. మరీ, ఈ కాంట్రవర్సీ సబ్జెక్ట్ తో వర్మ ప్రశంసల మాటేమో గానీ, విమర్శలు రాకుండా చూసుకుంటే చాలు.