గోదావరి పుష్కరాలకు ట్రూజెట్లు కదులుతున్నాయని ఇంతకుముందే వార్తలు వచ్చేసాయి. ఈ రోజు ఉదయం రామ్ చరణ్ తన ట్రూజెట్ విమాన కంపెనీకి సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో చిరంజీవి సినిమా గురించిన ప్రస్తావన ప్రధానాంశం అయ్యింది. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన విషయం పై వస్తున్న వార్తలకు యన తెరదించాడు. చిరంజీవి నటించే 150వ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ముఖ్యంగా కథ ఫైనల్ కాకుండా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు పూరీజగన్నాథ్ రాసిన స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ పూర్తిగా నచ్చిందని అయితే సెకండ్ ఆఫ్ పూరీజగన్నాథ్ ఇంకా పూర్తి చేయవలసి ఉందని ఈ కథ పూర్తిగా చిరంజీవికి నచ్చితేనే సెట్స్ పైకి వెళ్తుందని లేదంటే పూరీ సినిమా వెనక్కు వెళ్ళినట్లే అన్న సంకేతాలు అధికారికంగా రామ్ చరణ్ తెలియచేసాడు. అదేవిధంగా వినాయక్ కూడ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నాడని అందువల్ల చిరంజీవికి పూర్తిగా ఎవరి కథ నచ్చితే ఆ కథను తాను చిరంజీవి 150వ సినిమాగా నిర్మిస్తానని క్లారిటీ ఇచ్చాడు. అదే విధంగా పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ నిర్మాతగా నిర్మించబోయే సినిమాలో తాను హీరోగా నటిస్తానని క్లారిటీ ఇచ్చాడు చరణ్. అయితే ఇంతవరకూ మీడియాలో వచ్చిన న్యూస్ కొద్ది కొద్దిగా వాస్తవాలు ఉన్నట్టే కనిపిస్తోంది. రాంచరణ్ పూర్తిగా పూరీ జగన్నాథ్ అనీ అనలేదు... వినాయక్ ను కూడా కనఫం చేయలేదు. ఏ స్టోరీ బాగుంటే అది అన్నాడు కాబట్టి 150వ సినిమా ఎవరనేది సస్పెన్షనే... బహుశా ఈ సస్పెన్షన్ చిరంజీవి బర్త్ డే రోజునైనా వీడుతుందేమో చూడాలి.