సినిమా హీరోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఒకప్పటిలా కాదు కదా ఎన్నేళ్ళొచ్చినా హీరోలుగా నటించడానికి. అప్పుడు కేవలం నలుగురైదుగురు హీరోల మధ్యనే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఎంతో మంది ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డులోకి అడుగు పెడుతున్నారు. అందుకే హీరోలు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నాగార్జున ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేశారు. అదే విధంగా చిరంజీవి... ఇప్పుడు చిరు తనయుడు రాంచరణ్. భార్య ఉపాసన ప్రోత్సాహంతో తన స్నేహితుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా చేసినప్పటికీ, అదే పెట్టుబడిగా కొనసాగించారు. ఇప్పుడు చరణ్ టర్బో ఏవియేషన్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం జరుగుతుంది కానీ, బ్రాండ్ నేమ్ మాత్రం ట్రూజెట్ అంటున్నారు. ఇవన్నీ హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ వంటి నగరాల్ని కలుపుకుంటూ స్థానికంగా ఎగిరే ఎరోప్లేన్స్, ప్రస్తుతానికి ట్రూజెట్ కి ప్రభుత్వం క్లియరెన్స్ వచ్చేసింది. ఏప్రిన్ నుంచి విమానాలు గాల్లోకి ఎగురుతాయని తెలుస్తోంది. ఒక ఒక వైపు వ్యాపారంతో పాటు సినిమాల వైపు కూడా ఆచీ తూచీ సక్సెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కథ ఒకే చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మార్చి 5న ప్రారంభించనున్నారు.