నటనకు భాష్యం చెపుతున్న శివగామి

July 18, 2015 | 04:35 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Ramya_Krishna_shivagami_comments_niharonline

నీలాంబరిగా పొగరు చూపించినా... శివగామిగా దర్పం కనబరిచినా... అమ్మోరుగా భక్తిభావం కలగాలన్నా అది నటనలో రమ్యకృష్ణకు ఉన్న అంకిత భావం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకటి రెండు సినిమాలతో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసే హీరోయిన్లకు,  స్వశక్తితో ఎన్నో డక్కాముక్కీలు తిని పైకెదిగిన హీరోయిన్లకు చాలా తేడా కనిపిస్తుంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చిందంటే వాళ్ళు నటనలో ఆరితేరిన వారని అర్థం కాదు అందాలు ఒలకబోయడంలో ఆరితేరారనే అర్థమూ వస్తుంది. అది నేటి హీరోయిన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. 
అది రమ్యకృష్ణ కూడా గమనించినట్టుంది. ప్రస్తుత హీరోయిన్లలో కష్టపడే మనస్థత్వం తగ్గి పోతోందని అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. తాను హీరోయిన్ గా నటించే రోజులలో ఒక సీన్ కు సంబంధించి ఒక డైలాగ్ పూర్తి చేసిన తరువాత ఆ తరువాత వచ్చే రెండవ సీన్ లో ఎలా నటించాలి అంటూ సహ నటులతో మాట్లాడుతూ ఉండేవారమని అయితే ఇప్పటి తరం నటీమణులు తమ సీన్ కు సంబంధించిన డైలాగ్ పూర్తి కాగానే తమ విలాసవంతమైన కార్వాన్ వ్యాన్ లోకి వెళ్ళిపోయి తమ సెల్స్ కు వచ్చిన మెసేజ్ లు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు అంటూ విమర్శలు చేసింది రమ్యకృష్ణ. ఇక తాను ‘బాహుబలి’ లో చేసిన శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ చాలామంది తనను పొగుడుతూ మెసేజ్ లు పెడుతున్నారని ఆ పాత్రలో తాను అంత బాగా రాణించాను అంటే ఆ డైలాగ్స్ తాను తన సొంత గొంతుతో పలికాను కాబట్టి ఆ భావాలు తన ముఖ కవళికల్లో కనిపించాయని అభిప్రాయ పడింది రమ్యకృష్ణ. అయితే నేటితరం హీరోయిన్స్ కు తాము పలుకుతున్న తెలుగు డైలాగులకు కూడ అర్ధం తెలియని నేపధ్యంలో ముఖంలో ఎక్స్ ప్రేషన్స్ ఎలా చూపెట్టగలరు అంటూ ప్రశ్నించింది శివగామి. ఈ సినిమాలో తాను ఇంత అద్భుతంగా నటించగలిగాను అంటే తనకు ఇచ్చిన ప్రతి సీన్ లోను ఎలా నటించాలో ఒకటికి పది సార్లు నటించి చూపించిన రాజమౌళికి ఆ క్రెడిట్ దక్కుతుందని కామెంట్ చేసింది. అంతేకాదు ఏ నటికైనా ఇటువంటి పాత్రలు జీవితంలో ఒకే ఒక్కసారి దక్కుతాయని ఎప్పుడూ అటువంటి పాత్రల కోసం ఎదురు చూడటం దురాశ ఆని కామెంట్ చేస్తోంది ఈనాటి టాలీవుడ్ శివగామి.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ