పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో తనపై అత్యాచారయత్నం జరిగిందని టాలీవుడ్ నటి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్ కతాలోని తన ఇంటి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. తాను ఇంట్లోకి వెళ్లబోతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనను అటకాయించాడని, అంతేగాక తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెలిపింది. ప్రతిఘటించిన తాను గట్టిగా అరవడంతో అతడు తన మొబైల్ ఫోన్ లాక్కుని అక్కడినుంచి పారిపోయాడని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు నటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.