మాస్ మహారాజ రవితేజ ‘కిక్ 2’ డబుల్ కిక్కిస్తుందంటూ చిత్ర బృందం ఊదర గొట్టినా... జనాలకు అందులో కిక్కేమీ కనిపించలేదో ఏమో... పెద్దగా చర్చలేమీ జరగడం లేదు ఈ సినిమా మీద. రవి తేజ మాత్రం కమిట్ మెంట్ ప్రకారం సినిమాలు చేసుకుంటూ పోతారు. ఇంతకు ముందులా కాదు సినిమా ఇండస్ట్రీ అంటే టాలెంట్ ఉన్న వారెందరూ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో ట్రెయినింగ్ తీసుకుని మరీ అడుగులు వేస్తున్నారు. ఇక వారసులు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నారు. పరో పక్క కోట్లకు కోట్లు ఖర్చపెట్టి తీసినా ఒకప్పటిలా వచ్చిన సినిమా వదలకుండా చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఈ తరుణంలో సినిమాలు ఏది పడితే అది తీసి పారెయ్యడం... చిత్ర బృందం మొత్తం మీద దెబ్బడిపోతుంది. దీంతో అందరు హీరోలూ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. ఒక పక్క 45-50 ఏళ్ళ మధ్య హీరోలకు ఛాన్స్ లు తగ్గే సూచనలు కనబడుతున్నాయి. దీంతో మాస్ మహరాజ రవి తేజా కూడా ఆచీ తూచీ అడుగు పెట్టక తప్పడం లేదు. ఆయన ఇప్పుడు పెద్ద దర్శకుల కంటే హిట్లిచ్చే చిన్న దర్శకులు మేలనుకున్నాడేమో... తన తదుపరి సినిమాను ఇటీవలే ఫ్లాప్ కొట్టిన దర్శకుడితో చెయ్యడం విశేషం. నిఖిల్ తో స్వామిరారా వంటి హిట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ వర్మ ఆ తరువాత కాస్త అంచనాల నడుమ విడుదలైన 'దోచేయ్' నెగిటివ్ ఫలితాలని అందించింది. దాంతో అవుట్ ఫోకస్ లోకి వెళ్ళిపోయిన సుధీర్ చెప్పిన కధ నచ్చడంతో వెనుక ఫ్లాప్ వున్నా మన మాస్ మహారాజ్ ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినా కంటెంట్ నచ్చితే ఫ్లాప్ దర్శకులతో సైతం చేయికలపడం మొదట్నుంచీ రవితేజకు అలవాటే.
తనతో 'షాక్' వంటి ప్లాప్ సినిమా తీసిన హరీశ్ శంకర్ తో రవితేజ 'మిరపకాయ్' సినిమా చేశాడు. అలానే 'అశోక్' 'అతిథి' చిత్రాలతో రెండు పరాజయాలను తన ఖాతాలో జమచేసుకున్న సురేందర్ రెడ్డికి 'కిక్' ఇచ్చాడు. హ్యాట్రిక్ ఫ్లాపుల తరువాత కూడా గుణశేఖర్ తో 'నిప్పు' చేశాడు. ఇప్పుడు దోచెయ్ దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఏమవుతుందో వేచి చూడాల్సిందే.