రియల్ జేజమ్మ అనుష్క

October 15, 2015 | 03:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
anushka_not-demands-remunaration-niharonline

అనుష్క సినిమాలన్నీ డబ్బు కోసం కాకుండా కేవలం నటనకే ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తుంది. వైవిద్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంది. ఇక సినిమాకు కమిట్ అయిన తరువాత తన డెడికేషన్ ఎంతలా ఉంటుందంటే, ఆ పాత్రతో ఆడుకుంటుంది. అందుకే అప్పటి అరుంథది అయినా, ఇప్పటి రుద్రమ అయినా ఈ పాత్రకు అనుష్క తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్నంత పేరు తెచ్చుకుంది. అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, రుద్రమదేవి సినిమాల కోసం ఆమె ఏళ్ల తరబడి శ్రమించింది. రెమ్యూనరేషన్ కూడా ఓవర్ గా డిమాండ్ చేయదనే మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ‘రుద్రమదేవి' సినిమా విషయంలో దర్శక నిర్మాత గుణశేఖర్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట. ముందు సినిమా పూర్తి కానివ్వండి. ఆ తర్వాత డబ్బలు గురించి ఆలోచించొచ్చు అని అనేదట.  ఇప్పుడున్న నటీమణుల్లో కేవలం పాషన్ తో చేసే నటీమణి అంటే అనుష్కనే చెప్పుకోవాలి… ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లలో కథ నచ్చితే పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోను అని అనుష్క స్పష్టం చేసిందట. ఈ సినిమా వదులుకోకూడదు అనేంత గొప్ప కథ అయితే అసలు పారితోషికమే అడగను అని అన్నదట. ఒక సినిమాకు పని చేస్తున్నపుడు టీం బావుండాలని కోరుకుంటాను. సినిమా ఫలితం ఎలా ఉన్నా మా మధ్య సంబంధబాంధవ్యాలు బాగుండాలని కోరుకుంటానంటోంది. అయితే తను రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందనేది అఫీషియల్ గా చెప్పేవాళ్ళు ఉండరు కానీ, రుద్రమదేవి సినిమా కోసం అనుష్క దాదాపు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు మాత్రం వార్తలు వినిపిస్తాయి. సినిమా యాక్టర్లన్న తరువాత రెమ్యునరేషన్ విషయంలోనూ, నటీమణుల మధ్య పోటీ విషయంలోనో ఎప్పుడో ఓసారి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంటారు నటీమణులు కానీ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్ళయినా అనుష్క విషయంలో మాత్రం ఎలాంటి చెడు వార్త వినకపోవడం అనుష్క మంచి గుణాన్ని తెలియజేస్తుంది. ఆమె సినిమాలోనే కాదు నిజంగా కూడా జేజెమ్మ అనుకోవాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ