హ్యాట్సాఫ్ రేణు...

October 09, 2015 | 04:12 PM | 1 Views
ప్రింట్ కామెంట్
renudesai-tweet-about-scholl-subjects-niharonline

ఎవరినో ఒకరిని కామెంట్లతో నొప్పించకుండా సమాజానికి ఉపయోగపడేలా ట్విట్టర్ లో నాలుగు మంచి మాటలు రాసుకొస్తుంది రేణు దేశాయ్.  సోషల్ నెట్వర్క్ లో ఎప్పుడూ అలర్ట్ గా ఉంటూ ఆలోచనాత్మకమైన ట్వీట్స్ చేస్తుంటారు. మొన్నామధ్య వినాయక చవితి రోజున గణేషునికి ఐటమ్ సాంగ్స్ కావాలా? అని సెటైర్లు వేసి, గణేషుని ఉత్సవాల పేరిట ఎంజాయ్ చేసే వారికి మంచి చురక అంటించింది. ఆమె ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబులిటీ ఫీలవడం కొందరికి బాగా నచ్చుతుంది. ఇప్పుడు రేణు దేశాయ్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందులో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి కూడా. 
ఆమె చెపుతున్నదేమిటంటే... స్కూల్ లో పిల్లలకు బయోలజీ, జామెట్రీ లాంటి వాటికంటే... ముఖ్యమైనది దయ, కరుణ, సాహసం లాంటివి నేర్పించాలని. నిజమే ఒంటరి జీవితాల్లో ఇలాంటి ఫీలింగ్స్ అర్థం కాకుండా ఎదుగుతున్నారు పిల్లలు. పెద్ద కుటుంబాలుగా ఉన్నప్పుడు ఈ ఫీలింగ్స్ ఆటోమేటిక్ గా అలవడేవి. కానీ ఇప్పుడు వీటిని క్లాసులు పెట్టి నేర్పించాల్సి వస్తోంది. ఈ ట్వీట్ ద్వారా ఈ కాలం పిల్లల్లో ఉండాల్సిన మంచి లక్షణాలు ఉండటం లేదని, సాహస వంతులుగా ఎదగడం లేదని ఆమె స్పష్టం చేశారు. మంచి వ్యక్తిత్వంతో ఎదగడం ముఖ్యం. ఆ తరువాతే గణిత, సామాన్య, సాంఘీక శాస్త్రాలు... హాట్సాఫ్ రేణు...

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ