‘లహరి’ కి చిక్కిన ‘రుద్రమదేవి’

February 02, 2015 | 03:03 PM | 78 Views
ప్రింట్ కామెంట్

ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో భారీ అంచనాలతో విడుదలయ్యే మరో సినిమా ’రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్ కొన్ని సంవత్సరాలు రీసెర్చి చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ఇది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న 3డి మూవీ రుద్రమదేవి. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ ఆడియో రైట్స్ కోసం ప్రముఖ ఆడియో సంస్థలన్నీ పోటీ పడినప్పటికీ, చివరకు ఈ చిత్రానికి సంబందించిన ఆడియో హక్కులను ఎక్కువ మొత్తం డబ్బు చెల్లించి లహరి ఆడియో సంస్థ సొంతం చేసుకుంది. ఆడియో అధినేత జి. మనోహర్ నాయుడు ఈ ఆడియో రైట్స్ కొనడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, క్వాలిటీ విషయం లో కాంప్ర్ మైజ్ కాని గుణశేఖర్ ఆడియో రైట్స్ తమకు ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకున్నారు. మంచి క్వాలిటీ తో ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేస్తామని మనోహర్ నాయుడు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ