టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో చోరి జరిగింది. ఈ చోరికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఫైల్ చేశారట. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డౌట్ ఉన్న వారిని విచారించారు. పూరి ఫ్యామిలీకి బాగా దగ్గరైనవారే ఈ దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు. నగలు, విలువైన వస్తువులు సహా 15లక్షలు రూపాయల చోరి జరిగింది. ఈ విషయమై త్వరలోనే వివరాలను పోలీసులు ప్రకటించే అవకాశం ఉందట.