గుణశేఖర్ దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక చిత్రం రుద్రమదేవి 3డి ఎన్నో రిలీజ్ డేట్లు మార్చుకుంటూ చివరికి అక్టోబర్ 9 న రిలీజైపోతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు మంచి కుటుంబ కథా చిత్రంగా పొగడ్తలు కురిపిస్తూ యుఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది గానీ ఇంత భారీ వ్యయంతో అష్ట కష్టాలు పడి దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టిన తీసిన రుద్రమదేవికి మళ్ళీ కొన్ని సినిమాలు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.... రుద్రమదేవి రిలీజ్ అవుతున్న అక్టోబర్ 9 మరుసటి వారమే రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చని అనుకుంటున్నారు. బ్రూస్ లీ ఆడియో 2న విడుదల చేస్తున్నారు. ఓ రెండు వారాల్లో ఈ చిత్రం రిలీజ్ కావచ్చునని అనుకుంటున్నారు. మరో పక్క శివం 2న విడుదలవుతోంది. అది కాకుండా ప్రకాష్ కోవెల మూడి సైజ్ జీరోను కూడా విడుదల చేయాలనే తలంపుతో ఉన్నారు. రుద్రమ దేవిలాగే భారీ బడ్జెట్ తో తీసిన విజయ్ పులి ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా తమిళ, తెలుగుల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకూ కేవలం 9 రోజుల తేడా మాత్రమే ఉంది.
శింబు దేవన్ ఈ చిత్రాన్ని ఒక సోషియో ఫాంటిసి ఫిల్మ్ గా తీర్చి దిద్దారు. భారీ బడ్జెట్ తో చేశారు. ట్రైలర్స్, ప్రచార చిత్రాలు అంచాలు పెంచాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని.. అక్టోబర్ 1 న పులి చిత్రం తమిళ, తెలుగు తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ రెండు చిత్రాల డేట్స్ ఇప్పటికే కన్ ఫం చేశారు. మళ్ళీ రుద్రమదేవిని పోస్ట్ పోన్ చేస్తారా? లేక పులి రుద్రమదేవికి పోటీ కాబోదని అలాగే లాగించేస్తారా? వేచి చూడాలి.