వీరనారికి రొమాన్స్ పాటలు ఉండకూడదా?

July 30, 2015 | 12:32 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Rudramadevi_romantic_song_niharonline

13వ శతాబ్ధపు కాలం నాటి కాకతీయుల చారిత్రక కథ తో తీసిన చిత్రం ‘రుద్రమదేవి’. వీరనారి రాణి రుద్రమదేవి జీవితాన్ని తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఈ చిత్రంలో ఆమె వీరత్వాన్ని మాత్రమే కాదు, ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా తెరమీద చూపించారు. ‘ఔనా నీవేనా.... అనే ఈ  పాట ట్రైలర్ విడుదలైనప్పుడే కొందరు ఈ పాట గురించి చర్చించారు. సినిమాలో ఇలాంటి యాంగిల్ కూడా ఒకటి చూపించాలని తీసిన ‘బాహుబలి' ‘పచ్చబొట్టేసిన' పాట వివాదాస్పదం అయింది. మరి రుద్రమ దేవిలోనూ అనుష్క ఓ వీరనారి ఆమెకు ఈ రొమాంటిక్ పాట ఏమిటి? అనే వివాదం చెలరేగుతుందేమో నన్న టాక్ వినపడుతోంది. ఈ పాటలో రొమాన్స్ కాస్త హద్దుల్లో ఉంటే ఓకే, లేదంటే  విమర్శలు తప్పవని సినీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.  ఏ సినిమా విడుదలైనా రంధ్రాన్వేషణ, భూతద్దంలోంచి చూడ్డం అనేది ఎవరికైనా తప్పడం లేదు. ప్రశంసలు, విమర్శలు రెంటినీ ఎదుర్కోవాల్సిందే... వీరనారీమణులైతే మాత్రం ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది కదా... భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీసామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.  ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉంది. ఎంతో రిస్క్ తో ఓ చారిత్రక కథనాన్ని అందిస్తున్న గుణశేఖర్ కెరీర్ కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ