సల్మాన్ సరిగ్గా సరిపోతాడట

November 26, 2014 | 01:35 PM | 43 Views
ప్రింట్ కామెంట్

తన జీవితకథను సినిమాగా తీయోద్దంటున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాత్రలకు ఎవరెవరు సరిపోతారో మాత్రం చెప్పేస్తుంది. తన పాత్రకు పొడుగుకాళ్ల సుందరి దీపికా పడుకునే సరిగ్గా సరిపోతుందని ఇప్పటికే చెప్పేసింది. ఇప్పుడు తన భర్త షోయబ్ మాలిక్ పాత్రకు ఎవరు సరిపోతారో చెప్పేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతాడట. స్వతహాగా సల్మాన్ వీరాభిమాని అయిన సానియా ఇలా చెప్పడంలో ఏం వింత లేదులేండీ. మరి ఎవరైనా దర్శక, నిర్మాతలు ఈ విషయాలను కొద్దిగా చెవున వేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేయండి. సానియా ప్రస్తుతం తన ఆత్మకథ ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్ కోసం కష్టపడుతుందట. ఇప్పుడు ఈ స్థానానికి చేరడానికి తాను ఎదుర్కున్న లింగ వివక్షను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించబోతుందని సమాచారం. తాను ఒక మహిళను అయ్యాను కాబట్టే వివాదాలు తనను చుట్టుముడుతున్నాయని, అదే పురుషుడిని అయ్యి ఉంటే ఏ వివాదాలు ఉండకపోయేవేయో అని ప్రకటించింది. అన్నట్టు ఐక్యరాజ్యసమితి మహిళ విభాగానికి ఈ టెన్నిస్ స్టార్ రాయబారిగా ఎంపికైందండోయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ