శ్రీమంతుడు ఓవరాల్ కలెక్షన్ 154 కోట్లు!

September 01, 2015 | 05:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Sriamthudu_niharonline

శ్రీమంతుడు ఇంత సక్సెస్ సాధిస్తుందనీ బహుశా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, సూపర్ స్టార్ కూడా ఊహించి ఉండదు. కేవలం 25 రోజుల్లో ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్ 154 కోట్లు సాధించిందట. ఆరు నెలల్లో 60 కోట్ల రూపాలయ ఖర్చుతో తీసిన 'శ్రీమంతుడు' ఈ రేంజ్ సాధించడం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద చర్చ నీయాంశం అయ్యింది. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుప్రీమ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన శ్రీమంతుడు' 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయలు షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఇండస్ట్రీకి సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' సంచలన విజయాన్ని సాధించినందుకు నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  25 రోజులు దాటినా సూపర్‌ కలెక్షన్స్‌తో 'శ్రీమంతుడు' విజయపథంలో దూసుకెళ్తున్నందుకు ఎంతో  హ్యాపీగా వుందని ఈ చిత్రం బృందం ఆనందంగా ఉన్నారు. లాంగ్‌రన్‌లో సూపర్‌స్టార్‌ 'శ్రీమంతుడు' మరిన్ని వండర్స్‌ని క్రియేట్‌ చేయడం ఖాయం అని ట్రేడ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి. షేర్‌ వివరాలు!! వైజాగ్‌ 5,32,53,639,  ఈస్ట్‌: 5,34,98,803,  వెస్ట్‌: 4,11,22,200,  కృష్ణా: 4,13,57,969,  గుంటూరు: 5,34,06,010,  నెల్లూరు: 2,16,11,046,  సీడెడ్‌: 10,98,75,800,  నైజాం: 21,05,59,099,  తమిళ్‌నాడు: 3,71,82,500,  నార్త్‌ ఇండియా, ఒరిస్సా: 3,63,26,457,  కర్ణాటక: 9,80,25,750,  కేరళ: 15,00,000,  యుఎస్‌ఎ: 11,87,07,800, ఓవర్సీస్‌  (యుఎస్‌ఎ మినహా): 7,68,15,660.  టోటల్‌ మొత్తం షేర్‌: 95,32,42,733 టోటల్‌ గ్రాస్‌: 154 కోట్లు 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ