బాలీవుడ్ హీరో వయసును దృష్టిలో పెట్టుకోవడం లేదో ఏమో కాని ఐదు పదులు దాటబోతున్నప్పటికీ, బ్యాచ్‌లర్ గానే ఉంటాననే మాటకు బ్రేక్ వేసే ఉద్దేశం లేనట్టే ఉంది. ముద్దుగుమ్మలతో రొమాన్స్‌కైతే సై అంటున్నాడు సల్మాన్‌ఖాన్. కాని పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. నాకు తెలుసు ఇది చాలా క్లిష్టమైందని. అందుకే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు అని మరోసారి కన్‌ఫ్యూజ్ చేశాడు. పైగా తనకు పిల్లలైతే కావాలి గానీ పెళ్లాం వద్దంటూ విచిత్రంగా సెలవిచ్చాడు రీసెంట్‌గా. అంతటితో ఆగాడా. ఆ పిల్లలకు తల్లి కూడా కావాలట. కానీ ఆమె తన భార్య మాత్రం కాకూడదట. ఇంతకీ సల్మాన్ ఖాన్ మైండ్ సెట్ ఏమిటి?